పెళ్లి తంతు ముగిసిన తర్వాత తన భర్తతో కలిసి అత్తారింటికి వెళ్తున్న నవ వధువు మార్గమధ్యంలో కిడ్నాప్‌నకు గురయ్యింది. పాయింట్ బ్లాక్‌లో గన్‌తో బెదిరించి ఆమెను మాజీ ప్రియుడు ఎత్తుకెళ్లిపోయాడు. సినిమాను తలపించే ఈ ఘటన ఒడిశాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బొలన్గీర్ జిల్లాకు చెందిన యువకుడు హరిబంధు పటేల్‌కు.. కంటామల్ గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. శనివారం రాత్రి వధువు గ్రామంలో వివాహం జరిగింది. కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున వధూవరులు, వారి కుటుంబసభ్యులు తమ గ్రామానికి బయలుదేరారు.
ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని తార్భా రోడ్డులోని బడాబంధ వద్ద గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు అడ్డగించారు. పాయింట్ బ్లాక్‌తో తుపాకి పెట్టి వరుడ్ని చంపుతామని బెదిరించి, కారులో ఉన్న వధువును బలవంతంగా కిందకు దింపి, అక్కడ నుంచి పరారయ్యారు. ఆమెను తీసుకుని వెళ్లిపోతుంటే.. వరుడు, అతడి కుటుంబసభ్యులు నిస్సాహాయంగా నిలబడిపోయారు. అనంతరం తార్భా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వరుడు ఫిర్యాదు చేశారు. తనను గన్ పాయింట్లో బెదిరించి, భార్యను అపహరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విచారణలో ఆమెను అపహరించిన వ్యక్తి మాజీ ప్రియుడని ప్రాథమికంగా పోలీసులు నిర్దారించారు. నిందితుడు ఆచూకీ గుర్తించి, ఆమెను రక్షించేందుకు ప్రయత్నిస్లున్నట్టు తార్బా ఇన్స్పెక్టర్ అనితా కిడో తెలిపారు. వరుడు హరిబంధు పటేల్.. అతడి బందువులు కలిసి వివాహం కోసం వధువు గ్రామమైన కంటామల్కు వచ్చారని,పెళ్లి తంతు పూర్తయిన తర్వాత కారులో వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు వారిని అడ్డగించి తుపాకితో బెదిరించి వధువును తీసుకెళ్లిపోయారని అన్నారు. యువతి మాజీ ప్రియుడు, అతడి ఇద్దరు స్నేహితులు కలిసి ఈ కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు. పట్టపగలే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది. పోలీసు బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. గతంలో అతడ్ని ప్రేమించిన యువతి.. తర్వాత అతడి తీరు నచ్చక వేరే యువకుడ్ని పెళ్లి చేసుకోవడంతో మాజీ ప్రియుడు జీర్ణించుకోలేకపోయాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa