రేపల్లె నియోజకవర్గం వైసిపి సోషల్ మీడియా కో కన్వీనర్ గా చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లి గ్రామానికి చెందిన మామిళ్ళపల్లి శివ కోటేశ్వరావుని నియమిస్తూ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ దేవేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వైసీపీలో నిబద్ధత గల కార్యకర్తగా ఎంపీ మోపిదేవి వీరాభిమానిగా గుర్తింపు పొందిన శివ కోటేశ్వరావును సోషల్ మీడియా కో కన్వీనర్ గా నియమించటం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.