చంద్రబాబు కోసం దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో నీచ రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు సిద్ధాంతం నైతిక విలువలు లేవని, ప్రజా ప్రతినిధులు మంత్రులపై దుర్భాషలాడటం సరికాదని హితవు పలికారు. చంద్రబాబు, సోమ వీర్రాజు, పవన్ కళ్యాణ్ ఎందుకు కలిశారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు చేతిలో పవన్ కళ్యాణ్ ఒక కీలుబొమ్మని అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సోము వీర్రాజు రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, ఇంతటి నీచ సంస్కృతి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడ 60వ డివిజన్ వాంబే కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు డివిజన్లో ప్రజా సమస్యలపై పర్యటించారు.