కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తో కలిసి గురువారం తిరుమలలో దర్శించుకొన్నారు.ఈ సందర్బంగా తి. తి. దే చైర్మన్ వై. వి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఆలయ సంప్రదాయం ప్రకారం కేంద్రమంత్రికి స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.