రాష్ట్రంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు దాసోహం అయ్యారని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ఎద్దేవా చేశారు. 17వ డివిజన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్‌టి రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ లో ఉంటూ పౌరుషాన్ని కోల్పోయి అచేతనావస్థలో పవన్ కళ్యాణ్‌తో కలవడంతో బాబు రాజకీయంగా అనర్హుడిగా మిగిలారని అన్నారు. గతంలో మంచి పాలన అందించలేక చేతులెత్తేసిన చంద్రబాబు నేడు ప్రతిపక్ష పాత్రకఉ కూడా పనికి రాకుండా పోయారని ఆరోపించారు. త్వరలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో చంద్రబాబు నడిచే పరిస్థితులు దాపురించాయని ఎద్దేవా చేశారు. ఎన్ని పార్టీలు కలిసినా, ఎంతమంది వచ్చినా ప్రజాదరణ మెండుగా గల జగన్ మోహన్ రెడ్డిని ఎదిరించే సత్తా, దమ్ము ఎవరికీ లేదని కోలగట్ల స్వస్టం చేశారు.