గుంటూరు బావాజీనగర్ కు చెందిన షేక్ అర్షద్ అనే నాలుగేళ్ల బాలుడు కనిపించడం లేదని బుధవారం లాలాపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఈనెల 18న అర్షద్ ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. ఆడుకునేందుకు వెళ్లాడని భావించిన తల్లిదండ్రులు ఎంతకీ తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ప్రయోజనం లేకపోవడంతో బుధవారం ఫిర్యాదు చేశారని ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.