అక్రమంగా తరలించడానికి లోడ్ చేస్తున్న 500 బస్తాల రేషన్ బియ్యం, రెండు వాహనాలను పర్చూరు మండలం నూతలపాడు గ్రామంలో గురువారం తెల్లవారుజామున విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఈ వేకువజామున సుమారు మూడు గంటల ప్రాంతంలో విజిలెన్స్ సీఐ శ్రీహరిరావు తన సిబ్బందితో మెరుపు దాడి చేసి పాల వ్యాను నుండి లారీ లోకి రేషన్ బియ్యాన్ని లోడ్ చేస్తుండగా 500 బస్తాల రేషన్ బియ్యాన్ని స్పాట్ లో పట్టుకున్నారు.
రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది. నూతలపాడు రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డాగా తయారైన నేపధ్యంలో విజిలెన్స్ అధికారులు ఆ గ్రామాన్ని టార్గెట్ చేసుకొని వేట సాగిస్తున్నారు