రైతులందరూ పంటలకు ఈ క్రాప్ నమోదు చేసుకోకపోతే నష్టపోతారని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం కందుకూరు మార్కెట్ యార్డ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. నియోజకవర్గంలోనే రైతుల పంట నమోదు చేసేందుకు ఉద్యోగులు తీవ్రంగా శ్రమించిన 100% జరగలేదన్నారు. నమోదు కాకపోతే పంటలకు గిట్టుబాటు ధర కల్పించే అవకాశం ఉండదన్నారు. తప్పనిసరిగా రైతులందరూ ఈక్రాప్ నమోదు చేసుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa