అచ్చుతాపురం: రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ ఉపా ఫిజీషియన్ ఆరోగ్య కేంద్రాలు ఈనెల 21న ప్రారంభమవుతున్న ఎక్కిం సందర్భంగా స్టేట్ మోడల్ ఆఫీసర్ డాక్టర్ ఫ్లోరెన్స్ ఎస్తేరు పోతు బృందం బుధవారం పూడిమడక, అందాలపల్లి వికాస కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రాల్లో 14 రకాల రక్త పరీక్షలు చేయడానికి అవసరమైన పరికరాలను, ఆరోగ్య కేంద్రాల పనితీరు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిపిఎంఓ డాక్టర్ శ్రీధర్, జిల్లా ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ మోడల్ అధికారి డాక్టర్ జ్యోతి, అచ్చుతాపురం, హరిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు డాక్టర్ బి. అలేఖ్య, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ రజిని, హెల్త్ సిబ్బంది అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa