భార్యపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన కేసులో భర్తకు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. తెనాలి చినరావూరు తోటకు చెందిన జొన్నా గోపి తన భార్య కృష్ణవేణి పై అనుమానంతో గత ఏడాది జులై 2వ తేదీ రాత్రి ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరచాడు. వన్ టౌన్ ఎస్ఐ ఎం. ఉమా మహేశ్వరరావు కేసు నమోదు చేసి నిందితుడ్ని కోర్టులో హాజరుపరిచారు. సాక్షాధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడికి బుధవారం ఏడాదికి జైలు శిక్ష విధించారు.