సి ఎస్ పురం మండల తెలుగుదేశం పార్టీ మండల సర్వసభ్య సమావేశం స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం సాయంకాలం నాలుగు గంటలకు నిర్వహించనున్నట్లు టిడిపి పార్టీ మండల అధ్యక్షులు బొమ్మల బోయిన వెంగయ్య తెలిపారు. ఈ సమావేశంలో గ్రామ పార్టీ ఇన్చార్జి లను నియమించనున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు హాజరుకావాలని కోరారు.