సీఎం జగన్ భూములపై అన్ని హక్కులు కల్పించారని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని అవనిగడ్డలో 22 ఏ (1) కింద ఉన్న నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు పంపిణీ చేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... . 22ఏ(1) కింద నిషేధిత జాబితాలో ఉన్న 35 వేల ఎకరాలు రైతులదేనని సీఎం వైయస్ జగన్ చెప్పారని తెలిపారు. ఈ భూములపై సీఎం వైయస్ జగన్ అన్ని హక్కులు కల్పించారని పేర్కొన్నారు. భూమి రైతన్నకు ఒక సెంటిమెంట్ అన్నారు. రైతన్నకు ఒక హోదాను సీఎం వైయస్ జగన్ కల్పించారని గుర్తు చేశారు. 35 వేల ఎకరాలను గడిచిన ప్రభుత్వం సర్కారు భూమి అని పెట్టింది ప్రభుత్వ భూమి కాదు.. 90 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతాంగానిదే ఆ భూమి అని సీఎం వైయస్ జగన్ ఆర్డర్ ఇచ్చారు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించాలన్నారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో పెద్ద మార్పులు తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు.