గత ప్రభుత్వ దుర్మార్గమైన జీవోతో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యను పరిష్కరించి సుమారు 16,897 ఎకరాలను అన్నదాతలకు అందించేందుకు అవనిగడ్డకు వచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ఎమ్మెల్యే రమేష్ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు అని అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ తెలిపారు. అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ మాట్లాడుతూ.. అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. గత ప్రభుత్వం అన్యాయంగా 16897 ఎకరాలను దుర్మార్గమైన జీవోతో రైతులను ఇబ్బందులకు గురిచేశారు. పిల్లల పెళ్లీళ్లు చేసి కట్నాలు ఇవ్వకపోతే విడాకుల వరకు వచ్చాయి. పిల్లల చదువుల కోసం లోన్ పెట్టేందుకు కూడా కుదరడం లేదని చెప్పిన వెంటనే.. మంచి మనసుతో కలెక్టర్‌కు ఆదేశాలిచ్చి త్వరతగతిన పూర్తిచేశారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి వర్షాలు వస్తే మునిగిపోతాం. వరదలు వస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. మమ్మల్ని కాస్త జాగ్రత్తగా చూసుకోమని చెప్పిన వెంటనే పేద ప్రజల అవసరాలకు సంబంధించి ఏ పని అడిగినా కాదనకుండా చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీవులు ఉన్నాయి.. పంటు మీద రేవు దాటి వెళ్లాలి. ఏదైనా అర్ధరాత్రి పూట డెలివరీ కేసు, హార్ట్ ఎటాక్ వస్తే ఆస్పత్రికి వెళ్లడానికి 6–7 గంటల పాటు సమయం పడుతుందని చెబితే... కచ్చితంగా మనం పరిష్కారం చేద్దామని రూ.120 కోట్లతో బ్రిడ్జి మంజూరు చేశారు. అదే విధంగా మంచినీళ్లకు ఇబ్బందిపడుతున్నారని చెబితే.. రూ. కోటి మంజూరు చేస్తున్నాను అని చెప్పారు అని తెలియజేసారు.