ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీడిమామిడి విస్తరణకు ప్రభుత్వం కృషి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 20, 2022, 01:55 PM

రైతులకు లాభసాటిగా ఉండే జీడిమామిడి తోటల విస్తరణ కోసం జీడిమామిడి విస్తరణ పథకం ద్వారా ప్రభుత్వం కృషి చేస్తోందని పైల దేవదాస్ రెడ్డి అన్నారు. కంచిలి మండలంలోని పెద్దశ్రీరాంపురం గ్రామంలో సబ్సిడీతో ప్రభుత్వం సరఫరా చేస్తున్న జీడి మొక్కలను ఉద్యానశాఖ అధికారి ఆధ్వర్యంలో గురువారం పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా 8వేల మొక్కలను పంపిణీ చేసినట్లు ఉద్యానశాఖ అధికారి మాధవీలత వెల్లడించారు.

పెద్ద శ్రీరాంపురంలో 2, 500 మొక్కలు, కత్తివరంలో 1000, మండపల్లిలో 1000. మకరాంపురంలఓ 2000, గోకర్ణపురంలో 1, 500 మొక్కలు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వజ్జ మృత్యుంజయరావు మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు లడ్డు కేశవ పాత్ర, పిఎసిఎస్ అధ్యక్షుడు గుమ్మడి రామదాసు, సర్పంచ్ బల్లెడ సుమన్, విహెచ్ఎ గంగరాజు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com