జాతీయస్థాయి ఒలంపియాడ్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పోటీ పరీక్షలు భాగంగా స్థానిక పలాస నందు గల శ్రీ చైతన్య పాఠశాలలో ఇటీవల నిర్వహించే క్యాట్ ఒలంపియాడ్ లెవెల్ _1లో 74 మంది విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ బ్. వి. న్ మూర్తి గురువారము తెలిపారు. ఈ సందర్భంగా మెదడుకు పదును పెట్టి పరీక్షల్లో పిల్లలు రాణించాలని పేర్కొన్నారు. ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు పలాస బ్రాంచ్ నుండి జాతీయస్థాయిలో ఎంపిక అవడం అభినందనీయమని ఏజీ. ఎం సురేష్ కొనియాడారు. డిసెంబర్లో జరగబోయే లెవెల్ _2 పరీక్షల్లో మరికొన్ని బహుమతులు గెలుపొందాలని రీజనల్ ఇన్చార్జి రామి నాయుడు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కోఆర్డినేటర్ బాలరాజు, డీన్ కోటేశ్వరావు, అస్స్తనెంట్ డీన్ షణ్ముఖ, సి బ్యాచ్ ఇంచార్జ్ జోగారావు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.