రాజస్థాన్ లోని భరత్‌పుర్ జిల్లాలో దారుణం జరిగింది. హరియాణాకు చెందిన మహిళపై దుండగులు సామూహిక అత్యాచారం చేసి హత్యచేశారు. ఈ నెల 18న ఆ మహిళ మృతదేహం లభ్యమైంది. తన కూతురు 9 నెలల క్రితం కిడ్నాప్ కి గురైందని, పోలీసుల సాయంతో వెతికినా ఆచూకీ దొరకలేదని, 3 నెలల క్రితం వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి, తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని చెప్పిందని తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.