సాధారణ కోడి మాంసంతో పోలిస్తే కడక్‌నాథ్ కోడి మాంసంలో కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. రుచి బాగుంటుంది. అందుకే దీనికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. కిలో మాంసం ధర రూ.1000 పైనే ఉంటుంది. ఒక్కో కోడి నెలకు 10-18 గుడ్లు పెడుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ పిల్లలు పెరుగుతాయి. 4 నెలల వ్యవధిలో కోడి మాంసానికి సిద్ధమవుతుంది. ఈ కోళ్లు కూరగాయలు, ఆకుకూరలు, రాగులు, సజ్జల్ని కూడా జీర్ణించుకోగలుగుతాయి.