మధ్యప్రదేశ్ కు చెందిన కన్నయ్యకు చిన్నప్పటి నుంచి బట్టలంటే తెగ చిరాకు. ఎవరైనా బట్టలు ధరించాలని చెబితే వారితో మాట్లాడకపోయేవాడట. కన్నయ్య బట్టలు లేకుండా బడికి రావడానికి బడ్‌వానీలోని ఉన్నత పాఠశాల యాజమాన్యం ఒప్పుకోలేదు. దీంతో కన్నయ్య కుటుంబం కలెక్టర్‌ను ఆశ్రయించగా పాఠశాలలో చేరేందుకు అనుమతి కల్పించారు. ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న కన్నయ్య అండర్ వేర్, తువ్వాలు ధరించి మాత్రమే కాలేజీకి వెళ్తున్నాడు.