మధ్యప్రదేశ్ రాష్ట్రం దమోహ్ జిల్లాలోని షాజాద్పురా అనే గ్రామంలో ఓ యువకుడు నగ్నంగా విద్యుత్ వైర్లపై వేలాడుతూ హల్ చల్ చేశాడు. ఓ స్తంభం పైనుంచి మరో స్తంభానికి వెళ్లాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని కిందకు దించారు. అయితే ఆ వ్యక్తికి మతిస్థిమితం లేదని, ఆ యువకుడు వేలాడుతున్న సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa