గుంతకల్లు మండల పరిధిలోని కసాపురం గ్రామంలో వెలసిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ నెల 26 నుండి హనుమద్ వ్రతం మండల దీక్షలు ప్రారంభం కానున్నాయి. గురువారం ఆలయం లో కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్ రెడ్డి, ఆలయ ఈఓ వెంకటేశ్వర రెడ్డి తదితరులు వ్రత దీక్షల ప్రచార గోడపత్రికలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ఈ నెల 26 న స్వామివారి మండల దీక్షలుప్రారంభం అవుతాయని, అర్ధ మండల దీక్షలు అక్టోబర్ 11న ప్రారంభం అవుతాయ న్నారు. డిసెంబర్ 4న ఇరుముడులు సమర్పణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా గుంతకల్లు పట్టణంలోని హనుమాన్ సర్కిల్ నుండి కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం వరకు తిరు ఉత్సవం ఉంటుందని చెప్పారు.