టపాసుల విక్రయదారులు అన్ని రకాల లైసెన్సులు, పత్రాలను కలిగి ఉండాలని లేని పక్షంలో యజ మానులపై చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ అన్నారు. తాడిపత్రి పట్టణంలోని ఆంజనేయస్వామి విగ్రహం వెనుక వైపున ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక టపాసుల విక్రయ కేంద్రాలపై ఆర్డీఓ ఫైర్ అధికారితో కలసి పరిశీలించారు. వివరాలను తహసీల్దార్ మునివేలును అడిగి తెలుసుకున్నారు. గోడౌన్ అను మతులు లేకుండా, లైసెన్స్లు లేకుండానే అక్రమ టపాసుల విక్రయాలు తాడిపత్రిలో ఎక్కువగా జరు గుతున్నాయని ఆయన దృష్టికి తీసుకురాగా వెంటనే అలాంటి వాటిపై విచారణ చేయాలని తహసీల్దార్, ఫైర్ అధికారి మోహన్ బాబుకు సూచించారు.