చంద్రబాబు పాలనలోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ అయ్యిందని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. సీఎం వైయస్ జగన్ అంబేద్కర్ ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం వైయస్ జగన్ లక్ష్యమైతే..దానిపై చర్చ జరుగకుండా చంద్రబాబు, పవన్ దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పనికిమాలిన పప్పు నా కొడుకా..సీఎం వైయస్ జగన్ గురించి మాట్లాడేది..సీఎం వైయస్ జగన్ పులి కాబట్టే మంగళగిరిలో నువ్వు ఆహారం అయ్యావు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు చేసిన వెధవ పనుల వల్లే 420 అంటున్నారు. వైయస్ జగన్‌కు వచ్చిన గేమ్..పొలిటికల్ ఫుట్‌బాల్..ఒకే ఒక షాట్..10 బాళ్లు ఒకేసారి గోల్స్‌లో పడుతాయని హెచ్చరించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని, సంక్షేమ పథకాలపై ప్రజల్లో చర్చ జరుగకుండా ప్రతిపక్షం అడ్డుపడుతుందని మండిపడ్డారు. శుక్రవారం కొడాని నాని మీడియాతో మాట్లాడారు.