చంద్రబాబు, పవన్ కల్యాణ్ వైఖరీలను మంత్రులు తీవ్రంగా తప్పుపట్టారు. టీడీపీ కలవని, పొత్తు పెట్టుకోని పార్టీ అంటూ లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. ఎల్లోమీడియా నిత్యం అవాస్తవాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ నేతల మాటలు, వాడిన భాష రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్నారు. అలానే, బాబు ఇచ్చే ప్యాకేజీకి పవన్ లాలూచీపడ్డారని మంత్రి గుమ్మనూరు జయరాం విమర్శించారు. చంద్రబాబు, పవన్ తలదించుకునేలా రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విమర్శలకు సమాధానం చెప్పలేని వ్యక్తి పవన్ అని మండిపడ్డారు. రాజకీయాల్లో ఓర్పు, సహనం అవసరమని హితవు పలికారు.