టీడీపీ హయాంలో ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేశారని మంత్రి విడదల రజని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముసుగు తొలగిపోయిందని చెప్పారు. పవన్ వాడిన భాష దారుణంగా ఉందని ఫైర్ అయ్యారు. విశాఖ గర్జన సక్సెస్ను డైవర్ట్ చేసేందుకు అలజడి సృష్టించారని పేర్కొన్నారు. అలానే, పవన్ తన దత్తపుత్రుడు అని చంద్రబాబు రుజువు చేశాడని మంత్రి ఉషాశ్రీ చరణ్ వ్యాఖ్యానించారు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని పిలుపు ఇవ్వడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవాన్ని పవన్ దెబ్బతీశారని మండిపడ్డారు.