ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ సేవలను శుక్రవారం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ గిరీష డీఎంహెచ్ఓ కొండయ్య , ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, వైసిపి మైనార్టీ నాయకులు బేపారి మహమ్మద్ ఖాన్ లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ప్రతి ఇంటికి ఒక డాక్టర్ ఫ్యామిలీ కాన్సెప్ట్ ను శుక్రవారం రాయచోటి ఏరియా ఆసుపత్రి ఆవరణంలో ప్రారంభించడం జరిగిందన్నారు.
జిల్లా వ్యాప్తంగా 47 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని అన్ని సచివాలయాలలో ఫ్యామిలీ డాక్టర్లు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. ఫ్యామిలీ డాక్టర్ విధానములో భాగంగా పీహెచ్సీలో పనిచేసే ఇద్దరు వైద్యుల్లో ఒకరు పీహెచ్సీలో ఉంటే, మరో వైద్యుడు 104 వాహనంతో గ్రామాలకు వెళ్లి తన కేటాయించిన సచివాలయా పరిధిలోని కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తారన్నారు. ఫ్యామిలీ డాక్టర్ సేవలకు సంబంధించి కావలసిన అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మెడిసిన్స్, డాక్టర్స్, స్టాఫ్ నర్స్ వీళ్ళందర్నీ రిక్రూట్మెంట్ చేయడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నవాళ్లు తమ పరిధిలో ఉన్న వెల్నెస్ సెంటర్ తన ఇంటి దగ్గర లొనే వైద్య సేవలు అందించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి కల అన్నారు. జిల్లాలోని ప్రజలందరూ కూడా ఫ్యామిలీ డాక్టర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.