రాత్రి సమయంలో తాళం వేసిన ఇంట్లోకి దొంగలు చొరబడి నగదుతో పాటు ఆభరణాలు అపహరించారు. త్రిపురాంతకం మండల కేంద్రంలోని బ్రహ్మంగారీ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. ఓ పెట్రోల్ బంకులో మేనేజర్ గా పని చేస్తున్న సి. సునీత ఇంట్లో బీరువాలో ఉన్న రూ. 12 వేల నగదుతో బంగారం, వెండి వస్తువులు అపహరించినట్లు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.