జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని పదేపదే మాట్లాడుతున్న జగన్ ఒకప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ భార్యకు బలవంతంగా విడాకులు ఇప్పించి తన చెల్లెలు షర్మిలతో పెళ్లి చేసిన విషయం గుర్తులేదా? అని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు హరిప్రసాద్, తిరుపతి ఇన్చార్జి కిరణ్ ప్రశ్నించారు. జనసేనాని మాట్లాడింది బూతులైతే వైసీపీ మంత్రులు మాట్లాడేది సుప్రభాతమా అని ప్రశ్నించారు.