పోలీస్ అమరవీరుల గొప్పతనం, భావితరాలకు తెలియాలని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో హోంమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ రోజు మావోయిస్ట్‌లు జనజీవన స్రవంతిలో కలుస్తున్నరంటే దానికి కారణం వీరు చేసిన త్యాగమన్నారు. మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకువచ్చి పోలీసులు వారి రక్షణకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి పోలీసులకు స్మార్ట్ టెక్నాలజీ అందిస్తున్నామన్నారు. సీఎం రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నామని తానేటి వనిత తెలిపారు.