అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి సేకరించిన భూములను దోచుకునేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. అయన మాట్లాడుతూ... రాజధాని భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని న్యాయస్థానాలు తప్పుపట్టినా దొడ్డిదారిలో ఆర్డినెన్స్ తేవడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మాస్టర్ ప్లాన్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. న్యాయస్థానాల పరిధిలో ఉన్న అంశాలపై ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుందని ప్రశ్నించారు. ప్రజా ప్రయోజనాల కోసం చేసిన చట్టాలను వైసీపీ నేతల భూదాహాన్ని తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి ప్రజావ్యతిరేక నిర్ణయాలు మానుకోవాలని... లేకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి వచ్చినన్ని ఓట్లు కూడా వైసీపీకి రావంటూ ఏలూరి సాంబశివరావు హెచ్చరించారు.