విశాఖపట్నం ఘటనలో భాగంగా జనసేన కార్యకర్తల పై పోలీసులు కక్షపూరిత వైఖరి ప్రదర్శించారు అని జనసేన నాయకులూ ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. వారు మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన అంశంపై జనసేన కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన వైసీపీ కార్యకర్తలపై నో కేస్, నో యాక్షన్. నిన్న వైసీపీ, జనసేన నాయకులు పోటాపోటీగా జగన్, పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఈ క్రమంలో పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారు. ఈ వ్యవహారానికి సంబంధించి వైసీపీ నాయకులపై యాక్షన్ తీసుకోని పోలీసులు.. జనసేన నాయకులపై మాత్రమే రియాక్షన్ చూపించారు. పశ్చిమ నియోజకవర్గం చెందిన 16 మంది జనసేన పార్టీ నాయకులను టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారని జనసేన నాయకులు చెబుతున్నారు.