ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివేకానంద రెడ్డి హత్యపై స్పందించిన షర్మిల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 21, 2022, 01:34 PM

సీఎం జగన్ బాబాయ్ ఐనటువంటి వివేకానంద రెడ్డి హత్యపై వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించడం  జరిగింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై కాగ్‌ కు షర్మిల  ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా  ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వివేకా హత్యపై స్పందించారు. తన కుటుంబంలో జరిగిన ఘోరం ఇదని ఆవేదన వ్యక్తం చేశారు. సునీతకు న్యాయం జరగాలని ఆకాంక్షించారు. తమ చిన్నాన్నను అంత ఘోరంగా ఎవరు హత్య చేశారో.. వాళ్లకి శిక్ష పడాలన్నారు. దర్యాప్తును ఎవరు అడ్డుకోవడానికి వీల్లేదని షర్మిల పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com