పాదయాత్ర చేపడుతున్న అమరావతి రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నాలుగు రోజుల పాటు పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. యాత్రలో పాల్గొంటున్న 600ల మందికి గుర్తింపు కార్డుల పరిశీలన పూర్తయ్యాకే పాదయాత్ర చేపట్టాలని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల వైఖరి కారణంగా పాదయాత్రకు రైతులు తాత్కాలిక విరామం ప్రకటించారు. పోలీసుల వైఖరిపై రైతులు హైకోర్టును ఆశ్రయించనున్నారు.