సత్యసాయి జిల్లాలో రేషన్ బియ్యం కొనుగోలు చేసి అక్రమంగా వైయస్ఆర్ జిల్లాకు తరలిస్తుండగా శక్రవారం సాయంత్రం రెండు లగేజీ ఆటోలు, చౌకబియ్యాన్ని స్వాధీనం చేసుకొన్నామని ఎస్ఐ హృషికేశ్వర రెడ్డి శుక్రవారం తెలిపారు. కొండాపురం గ్రామానికి చెందిన పగడాల నాగన్న, దాసరి సుబ్బన్నలు రెండు ఆటోల్లో 840 కిలోలు రేషన్ బియ్యం సత్యసాయి జిల్లా ముదిగుబ్బ ఘాట్ నుంచి తరలిస్తుండగా అంబకపల్లె వద్ద దాడి చేసి బియ్యం, ఆటోలను స్వాధీనంచేసుకొని, నిందితులను కోర్టుకు హాజరుపరిచామని ఎస్. ఐ తెలిపారు.