మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి నీటి విడుదల కొనసాగుతోంది. మైలవరం జలాశయం నుంచి ఐదు గేట్ల ద్వారా పెన్నా నదికి 26, 700 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు జలాశయ ఏఈఈ గౌతమ్ రెడ్డి శనివారం తెలిపారు. గండికోట జలాశయం నుంచి మైలవరం జలాశయానికి 27, 700 వేల క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుండగా దక్షిణ కాలువకు 150 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం మైలవరం జలాశయంలో 5. 600 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గండికోట జలాశయం నుంచి మైలవరానికి ఇన్ ఫ్లో పెరిగితే మరింత నీటిని పెన్నా నదికి వదిలే అవకాశం ఉన్నట్లు జలాశయ అధికారులు తెలిపారు.