బొబ్బిలి పట్టణంలో త్రాగునీరుకి శాశ్వత పరిష్కారం కొరకై 93. 62 కోట్లతో నిధులు తో శనివారం బొబ్బిలి పట్టణంలో సమగ్ర త్రాగునీటి అభివృద్ధి పథకం నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమనికి రాష్ట్ర విద్య మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఆయన వెంట జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ , శాసనసభ్యులు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు , జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి కార్యక్రమం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ రావు, వైస్ చైర్మన్లు గోలగాన రమాదేవి, చెలికాని మురళీకృష్ణ, జడ్పిటిసి శాంతి కుమారి, కౌన్సిలర్లు, బొబ్బిలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.