బొబ్బిలి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ శనివారం బొబ్బిలి కొన్ని ప్రారంభోత్సవ కార్యక్రమం విచ్చేసిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కి ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి బి రవికుమార్ వినంత పత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా బి రవికుమార్ మాట్లాడుతూ విద్యల నగరంగా పేరుగాంచినటువంటి బొబ్బిలి పట్టణంలో ఇప్పటికీ ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల లేకపోవడం అన్యాయమని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అత్యధిక బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులేనని. ఈ తరుణంలో ప్రైవేట్ కళాశాలలో అధిక ఫీజులు కట్టి చదువుకునే పరిస్థితి ఏర్పడుతుందని బొబ్బిలిలో ఎంతోమంది ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల ఊసే ఎత్తడం లేదని అన్నారు కావున పేద విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే బొబ్బిలి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసే విధంగా చూడాలని కోరారు.
ఇప్పటికే బొబ్బిలిలో ఉన్నటువంటి కళాశాలైనటువంటి రాజా కాలేజ్ ప్రైవేట్ పరం అయిందని ఇకనైనా ప్రజాప్రతినిధులు కళ్ళు తెరిచి బొబ్బిలి పట్టణం లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు న్యాయం చేసే విధంగా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.