రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కంటే వైద్యసేవలు అందజేస్తుందని బొండపల్లి ఎంపీపీ చల్లా చలంనాయుడు అన్నారు. శనివారం బొండపల్లి మండలం లోని కనిమెరక గ్రామ సచివాలయం వద్ద ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కార్యక్రమాన్ని ఎంపీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ సందర్భంగా 71 మందికి పరీక్షలు జరిపి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్. పి. టి. సి రాపాక సూర్యప్రకాశరావు గ్రామ సర్పంచ్ సిరిపురపు ఆదినారాయణ, ఎంపీడీవో వేదవతి, తాసిల్దారు శ్రీనివాస్ మిశ్ర, వైద్యాధికారులు డాక్టర్ జె. ఝాన్సీలక్ష్మి, డాక్టర్ సత్యవతి, 145 డాక్టర్ రవిచంద్ర, డి. ఈ. వో జ్యోతి, ఎం. పి. హెచ్ వివో నాయుడు, ఎం. ఎల్. హెచ్. పి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.