అన్నమయ్య జిల్లా రాజంపేట హెడ్ పోస్టాపీసు లో పోస్టల్ అసిస్టెంట్ 40 లక్షలకు పైగా గోల్ మాల్ చేసినట్లు శనివారం పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు. మోసానికి పాల్పడ్డ కడప కు చెందిన పోస్టల్ అసిస్టెంట్ వడ్ల విష్ణు వర్ధన్ ఆచారి (32) వినియోగ దారుల ఖాతాల్లో నుండి వారికి తెలియ కుండా 40 లక్షలకు పైగా డ్రా చేసి స్వాహా చేసినట్లు వారు తెలిపారు. మోసానికి పాల్పడిన వడ్ల విష్ణువర్ధన్ ఆచారి సోదరుడు వడ్ల హేమంత్ఆచారి ఇరువురని అర్భన్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.