మాజీ మంత్రి వై.ఎస్.వివేకా కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం సబబే అని షర్మిల అన్నారని టీడీపీ నేత బీటెక్ రవి గుర్తుచేశారు. ఈ కేసులో సాక్షులను బెదిరిస్తున్నారనే విషయం షర్మిలకు కూడా తెలుసని అన్నారు. కేసును విచారిస్తున్న అధికారులపై కూడా కేసులు పెట్టడం ఏమిటని మండిపడ్డారు. వివేకా హంతకులు సెంట్రల్ జైలు నుంచి స్వేచ్ఛగా బయటకు వస్తున్నారని చెప్పారు. కడప ఎంపీ సీటు విషయంలో వివేకా అడ్డు తగలడంతోనే ఆయనను హత్య చేశారని తెలిపారు. వివేకా హత్య జరిగిన వెంటనే లోటస్ పాండ్ లో ఉన్న జగన్ కు అన్ని వివరాలు తెలిసిపోయాయని చెప్పారు. హంతకులకు కొమ్ముకాస్తున్న జగన్ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.