దీపావళీ పండుగను పురస్కరించుకొని బాణాసంచా దుకాణదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెన్నూరు మండలం తహాసిల్దార్ పటాన్ అలీ ఖాన్ తెలిపారు. 10 దుకాణాలకు లైసెన్సులు జారీ అయ్యాయని 8 దుకాణాలు రెన్యువల్ చేయడం జరిగిందని కొత్తగా 2 బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు పొందారని తెలియజేశారు. చెన్నూరు రాయలసీమ ప్రగతి గ్రామీణ బ్యాంకు ఎదురుగా దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.
బాణాసంచా దుకాణాల వద్ద ఇసుకతో నింపిన డ్రమ్ములు. నీళ్లు ఏర్పాటు చేయాలని సూచించడం జరిగిందన్నారు. చెన్నూరు మండలంలో నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన వారి దగ్గర్నుంచి బాణాసంచా కొనుగోలు చేయాలని తెలియజేశారు. బాణాసంచా దుకాణదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.