యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలో న్యాయ కళాశాలల అయిదేళ్ల, మూడేళ్ళ ఎల్. ఎల్. బి. మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. వైవీయులోని తన చాంబరులో కులసచివులు ఆచార్య దుర్భాక విజయరాఘవ ప్రసాద్, పరీక్షల నియంత్రణాధికారి డా. ఎన్. ఈశ్వరరెడ్డి పరీక్ష ఫలితాలు విడుదల చేసి వివరాలను వెల్లడించారు. ఎల్ ఎల్ బి (అయిదేళ్ళు) మొదటి సెమిస్టర్ పరీక్షకు 105 మంది హాజరు కాగా 25 మంది ఉత్తీర్ణత సాధించారు. 23. 81 శాతం ఫలితాలు వచ్చాయి. మూడేళ్ల లా కోర్సునకు సంబంధించి 365 మంది విద్యార్థులు హాజరుకాగా 92 మంది ఉత్తీర్ణులయ్యారు. 25. 21 శాతం ఫలితాలు లభించాయి. ఈ పరీక్షలు జూలైలో జరిగాయని తెలిపారు.