మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మపై జనసేన ఇంచార్జ్ ఉషా కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆడవాళ్ల పట్ల హేళనగా ప్రవర్తించే అంబటికి నోటీసులు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. అశ్లీల వీడియోల్లో హల్చల్ చేసిన గోరంట్ల మాధవ్ కు నోటీసులు ఇచ్చారా?.. కాసినో నిర్వహణకు పూనుకున్న కొడాలి నానికి నోటీసులు ఇచ్చారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. విడాకులు ఇచ్చిన వారికి నోటీసులు ఇవ్వడం ఏంటి.. రాష్ట్రంలో ఎవరు విడాకులు ఇచ్చినా వారందరికీ నోటీసులు ఇస్తారా అంటూ జనసేన ఇంచార్జ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.