ఎస్టీ జాబి తాలోకి ఇతర కులాలను చేర్చడం తగదని గిరిజన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు దివాకర్ పేర్కొన్నారు. విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బోయ, వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చా లని రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో ఏకసభ్య కమిషన ఏర్పాటు చేసి, మూడు నెలల్లోగా నివేదికను ప్రభుత్వానికి అందించాలని ప్రకటించి జీవో నెంబరు 52ద్వారా ఎస్టీ జాబి తాలోకి చేరుస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కార్యక్రమంలో ఆర్‌జీఎస్ నేతలు రెడ్డిశేఖర్, రమణ పాల్గొన్నారు.