దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభం అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 37.53 పాయింట్ల లాభంతో 59,869.19 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 18.85 పాయింట్ల లాభంతో 17,749.60 వద్ద కొనసాగుతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.66 గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, మారుతీ, ఇన్ఫీ, డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.