నేడు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడాన్ని సూర్యగ్రహణం అంటారు. తెలుగు రాష్ట్రాల్లో 25న సాయంత్రం 4 గంటల 49 నిమిషాల నుంచి గ్రహణాన్ని చూడవచ్చు. 49 నిమిషాల పాటు గ్రహణం ఉంటుంది. గ్రహణ సమయంలో గర్భిణీలు కదలవద్దని పాటించే ఆచారాన్ని నమ్మవద్దని జనవిజ్ఞాన వేదిక తెలిపింది. గ్రహణ మొర్రీ సమస్యకు, గ్రహణానికి అసలు సంబంధమే లేదన్నారు. గ్రహణ సమయంలో ఏం తినొద్దని, ఎటువంటి పనులు చేయవద్దనే మూఢ నమ్మకాలను నమ్మవద్దన్నారు.