ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ ఆందోళనపై మంత్రి లోకేశ్ ఆగ్రహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 04:56 PM

ఢిల్లీలో నిన్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు సృష్టించిన గందరగోళంపై  లోకేశ్ తీవ్ర ఆగ్రహం విచారం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై వారి ప్రవర్తన దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. ఏఐ రంగంలో ఎదుగుతున్న భారత్ శక్తిని ప్రపంచానికి చాటేందుకు ఉద్దేశించిన సదస్సులో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు.ఈ మేరకు లోకేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు.ఏఐ సూపర్ పవర్‌గా భారత్ ఎదుగుతున్న తీరును ప్రదర్శించేందుకు ఈ సదస్సు ఒక గొప్ప అవకాశం. అలాంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా మార్చడం ద్వారా ప్రపంచం ముందు మనందరి ప్రతిష్ఠను తగ్గించారు. ఇది దిగ్భ్రాంతికరం విచారకరం అని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.భారతదేశం ఇంతకంటే మెరుగైన గౌరవానికి అర్హమైనదని ఆయన అభిప్రాయపడ్డారు.మనం ఇలాంటి చిల్లర రాజకీయాలను పక్కనపెట్టి, ఆవిష్కరణలు, నైపుణ్యం ద్వారా దేశ నిర్మాణానికి ప్రాధాన్యత ఇద్దాం అని లోకేశ్ పిలుపునిచ్చారు. దేశ ప్రతిష్ఠకు సంబంధించిన విషయాల్లో రాజకీయాలు చేయడం తగదని ఆయన హితవు పలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa