ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ నోట్లపై వినాయకుడి, లక్ష్మీ దేవి ఫొటోలను ముద్రించాలని డిమాండ్ చేశారు. కొత్తగా వచ్చే కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ చిత్రంతో పాటు ఆ దేవుళ్ల చిత్రాలను ముద్రించాలన్నారు. ఈ మేరకు బుధవారం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గుజరాత్, హర్యానా ఎన్నికల నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీటిద్వారా హిందూత్వ అజెండాను లేవనెత్తారని పేర్కొంటున్నారు.