సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి చెందిన గొట్టిపాటి జయరావు (30) కొన్నేళ్లుగా ఎకరం పొలం కౌలుకు తీసుకుని మిరప సాగు చేసేవారు. పంట దిగుబడి రాక రూ. 2 లక్షలు అప్పులు మిగిలాయి. తీర్చే మార్గం లేక మానసిక ఒత్తిడికి గురై గడ్డి మందు తాగారు. ఆయనను కుటుంబ సభ్యులు గుంటూరు జి జి హెచ్ లో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారని ఆయన భార్య ప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.