అల్లం టీ తాగితే దగ్గు, జలుబు నుండి ఉపశమనం పొందొచ్చు. రక్తంలోని చక్కెర శాతాన్ని, శరీరంలో కొలెస్ట్రాల్ ను అల్లం తగ్గిస్తుంది. గుండె సమస్యలు కూడా రావు. కండరాల నొప్పులు, కీళ్ల నొప్పుల్ని అల్లం తగ్గిస్తుంది. నోటిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్ లను అల్లం తరిమేస్తుంది. వాంతులను నివారించే గుణం కూడా అల్లంకు ఉంది. అల్లం వల్ల జీర్ణం సాఫీగా జరుగుతుంది. అల్లం వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.