కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే ప్రమాణ స్వీకారం చేశారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ..ప్రియాంకగాంధీ..సిడబ్ల్యూసీ సభ్యులు..రాష్ట్రాల పిసీసీ అధ్యక్షులు,వర్కింగ్ ప్రెసిడెంట్లు..భట్టి విక్రమార్క,మధుయాష్కీ,పొన్నాల,వీహెచ్ తదితరులు హాజరైయ్యారు. ఖర్గే సారథ్యంలో కాంగ్రెస్ మరింత ముందుకెళ్తుందని సోనియా ఆశాభావం వ్యక్తంచేశారు. కాగా 24ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగాఎన్నికయ్యారు మల్లికార్జున ఖర్గే. ఇటీవలే జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్‌పై ఖర్గే ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.